బాలయ్య అలాంటి వ్యక్తి.. అందుకే వరుస సినిమాలు.. ప్రగ్యా జైస్వాల్ కామెంట్స్ వైరల్!

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో డాకు మహారాజ్ ( Daaku Maharaaj ) సినిమా కూడా ఒకటి.

జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో బాలకృష్ణ ( Balakrishna ) ప్రగ్యా జైస్వాల్ ( Pragya Jaiswal ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో నటించిన ప్రగ్యా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

Pragya Jaiswal Interesting Comments About Working With Balakrishna Details, Bala

నా పుట్టిన రోజున డాకు మహారాజ్ సినిమా విడుదలయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈ ఏడాది నాకు చాలా మంచిగా ప్రారంభమైందని భావించాను ఈ సినిమా విడుదలయ్యి మంచి సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను డాకు మహారాణి అని పిలుస్తున్నారని తెలిపారు.ఈ సినిమాలో నా పాత్ర చాలా విభిన్నంగా ఉందని, గర్భిణీ పాత్రలో నటించడం సరికొత్త అనుభూతిని కలిగించిందని తెలిపారు.ఇక ఇటీవల ఈమె బాలయ్యతో కలిసి అఖండ సినిమాలో( Akhanda ) నటించిన విషయం తెలిసిందే.

Advertisement
Pragya Jaiswal Interesting Comments About Working With Balakrishna Details, Bala

ఇక వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఉన్న నేపథ్యంలో ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ.నటనకు వయసుతో సంబంధం లేదని తెలిపారు.

Pragya Jaiswal Interesting Comments About Working With Balakrishna Details, Bala

ఒక పాత్రకు ఎవరైతే సరిగ్గా సరిపోతారనే విషయాన్ని బట్టి నటీనటులని ఎంపిక చేస్తారే తప్ప వయసును బట్టి కాదు అంటూ ఈమె తెలియజేశారు.ఇలా మరోసారి బాలకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి ఈమె ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడారు.ఆయన ఒక లెజెండ్ బాలకృష్ణ పేరు వింటేనే ఒక పాజిటివిటీ వస్తుందని తెలిపారు.

ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.అందరిని ఒకే విధంగా గౌరవిస్తారు మనసులో మాటలను నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తారు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు