పవన్‌తో సినిమా అంటేనే జడుసుకుంటున్న కంచె బ్యూటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓకే చేశాడు.

ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చిత్ర వర్గాల్లో ఆసక్తి నెలకొంది.కాగా ఈ సినిమాలో ఓ ఫేడవుట్ హీరోయిన్ నటించేందుకు చిత్ర యూనిట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

కంచె చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్, ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్టు పడలేదు.దీంతో ఆమె కెరీర్ ఫేడవుట్ అయ్యింది.

అయితే క్రిష్‌తో ఆమెకున్న స్నేహంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విరూపాక్ష సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.కానీ ఈ సినిమాలో నటించాలంటేనే అమ్మడు వణికిపోతుందట.

గతంలోనూ ఫేడవుట్ అయిన ప్రణీత పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించింది.ఆ సినిమాలో అమ్మడికి చాలా పేరు వచ్చినా, ఎందుకో అటు తరువాత నిలబడలేకపోయింది.

దీంతో ఇప్పుడు తన పరిస్థితి కూడా ఇలానే ఉండబోతుందా అని ప్రగ్యా సందేహ పడుతుందట.మరి పవన్ సరసన నటించే ఛాన్స్‌ను ఈ బ్యూటీ చేజిక్కించుకుంటుందా లేదక వదిలేస్తుందా అనేది చూడాలి.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు