ప్రభాస్ సెట్ లో ఎప్పుడూ అలాగే ఉండేవారు.. ప్రభాస్ గురించి నయన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

ఇలా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రభాస్ ప్రతి ఒక్క సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక ఈయన తన సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు.ఈ క్రమంలోనే నట నయన తారతో కలిసి కూడా ప్రభాస్ మున్నా అనే సినిమాలో నటించారు.

ఇకపోతే తాజాగా కనెక్ట్ అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నయనతార యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నయనతార ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యారు.ఇప్పుడు తన ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఆయనతో కలిసి సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉండేవారని తెలిపారు.

Advertisement

ప్రభాస్ మనస్తత్వం చాలా చిన్న పిల్లల మనస్తత్వమని ఈమె తెలియజేశారు.లొకేషన్ లో ఆయన ఒకచోట ఉండకుండా ఎగురుతూ దూకుతూ ఉండేవారు.షూటింగ్ లొకేషన్లో ఈయన అచ్చం చిన్నపిల్లడిలా ప్రవర్తించడమే కాకుండా జోకులు వేస్తూ అందరిని నవ్వించేవారు.

ప్రభాస్ తో కలిసి ఉండడం చాలా సరదాగా ఉంటుంది అంటూ నయనతార ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది.ప్రస్తుతం నయనతార ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement