ఆమే కావాలంటున్న ప్రభాస్.. ఎవరో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తు్న్నాడు.

సాహో తరువాత కొంత గ్యాప్ తీసుకుని జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమాను యమ స్పీడుగా షూటింగ్ చేస్తు్న్నాడు బాహుబలి యాక్టర్.

అయితే సాహోలో ప్రభాస్ సరసన తొలుత శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా అనుకోలేదని, ప్రభాస్ వేరొకరిని రికమెండ్ చేయగా ఆమె డేట్లు దొరకలేదని చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.సాహో లాంటి పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్‌ను తీసుకోవాల్సిందిగా కోరాడట ప్రభాస్.

కానీ ఆ సమయంలో కత్రినా డేట్లు దొరక్కపోవడంతో ఆ ఆఫర్ వెళ్లి శ్రద్ధా కపూర్‌కు దక్కింది.ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సూపర్ హీరో మూవీలో కత్రినా అయితే బాగుంటుందని ప్రభాస్ కోరాడట.

దీంతో చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.మరి ఈసారైనా ప్రభాస్ కోరిన కత్రినా ఓకే అంటుందో లేదో చూడాలి.

Advertisement

ఏదేమైనా ప్రభాస్ లాంటి స్టార్ హీరో పక్కన ఆఫర్ అంటే ఏ హీరోయిన్ మాత్రం వద్దంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement