యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీ షూటింగ్ కూడా మొదలెట్టేసాడు.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటలీలో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ తాజాగా మొదలైంది.
సాహో సినిమా షూటింగ్ మెజారిటీ పూర్తిగా కావడంతో దానికి ప్రభాస్ గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం ఈ లవ్ స్టొరీ షూటింగ్ కి రెడీ అయ్యాడు.ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన వింటేజ్ ఇటలీ సెట్ లో ప్రభాస్, పూజాహెగ్డే జాయిన్ అవ్వబోతున్నారు.
ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత మరల ప్రభాస్ సాహో ఫినిషింగ్ వర్క్ పూర్తి చేసుకొని కంప్లీట్ గా ఈ లవ్ స్టొరీ మీద ద్రుష్టి పెడతాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా యూవి క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా వందకోట్లకి పైగా బడ్జెట్ తోనే నిర్మిస్తుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy