భారీగా పడిపోయిన 'సలార్' వసూళ్లు..1000 కోట్లు ఇక అందని ద్రాక్షానే!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన సలార్ చిత్రం( Salaar ) రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

టాక్ తగ్గట్టుగా ఓపెనింగ్స్ , దానికి తోడు క్రిస్మస్ పండుగ కూడా తోడు అవ్వడం తో కేవలం 5 రోజుల్లోనే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

నైజాం ప్రాంతం లో దాదాపుగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి అతి దగ్గర్లోకి వచ్చేసింది.ఓవర్సీస్ లో నిన్నతో తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది.

ఇక్కడ భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఓవర్సీస్ లో కేవలం ఆదివారం నుండి మంగళవారం వరకు హిందీ వెర్షన్ వసూళ్లు 1 మిలియన్ డాలర్లు రాబట్టింది.

చూస్తూ ఉంటే హిందీ లో మంచి లాంగ్ రన్ వచ్చేట్టుగా అనిపిస్తుంది.కానీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో మాత్రం ఆరవ రోజు వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి.

Prabhas Salaar Movie Collections Dropped In Ap And Telangana Details, Prabhas ,s
Advertisement
Prabhas Salaar Movie Collections Dropped In Ap And Telangana Details, Prabhas ,s

ఇది ట్రేడ్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.నిన్న ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) మరియు తెలంగాణ లో( Telangana ) ప్రైవేట్ మరియు ప్రభుత్వ స్కూల్స్ కి సెలవు ఉండడం తో వసూళ్లు దుమ్ము లేపాయి.కానీ నేడు సంపూర్ణ వర్కింగ్ డే అవ్వడం తో ప్రతీ సెంటర్ లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

కొన్ని థియేటర్స్ లో అయితే డే డెఫిసిట్స్ పడ్డాయి.అంటే రోజువారీ థియేటర్ రెంట్స్ ని రాబట్టలేకపోయాయి అట.కృష్ణ జిల్లాలో నేడు 15 లక్షల రూపాయిల కంటే తక్కువ థియేట్రికల్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.అంటే ఇక రేపటి నుండి ఈ సినిమా కృష్ణ జిల్లాలో కమీషన్ బేసిస్ మీద రన్ అవ్వబోతుంది అనే చెప్పాలి.

కేవలం కృష్ణ జిల్లాలో( Krishna District ) మాత్రమే కాదు , ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా అన్నీ సెంటర్స్ లో వసూళ్లు పడిపోయాయి.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.

Prabhas Salaar Movie Collections Dropped In Ap And Telangana Details, Prabhas ,s

సలార్ ఓపెనింగ్స్( Salaar Openings ) ఊపుని చూసి కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందని ప్రతీ ఒక్కరు అనుకున్నారు.కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తూ ఉంటే అది అసాధ్యం అని అనిపిస్తుంది.కానీ న్యూ ఇయర్ వీకెండ్ మీద బయ్యర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఒక్క ఉత్తరాంధ్ర మినహా కోస్తాంధ్ర లో ఒక్క చోట కూడా సలార్ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.ఇక సీడెడ్ లో ఈ చిత్రం గట్టెక్కాలంటే కచ్చితంగా మరో ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టాలి.

Advertisement

అంటే ఈ వీకెండ్ కచ్చితంగా బాగా ఆడాలి, మరి ఆడుతుందో లేదో చూద్దాం.

తాజా వార్తలు