సాహో ట్రైలర్‌ టాక్‌ : మళ్లీ తెలుగోడికి ఇండియా జై కొట్టాల్సిందే

ప్రభాస్‌ సాహో చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్‌ అనుకోబట్టి దాదాపుగా ఆరు సంవత్సరాలు అవుతుంది.

దర్శకుడు సుజీత్‌ ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు పడ్డ కష్టం తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కనిపించింది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ ఆ స్థాయి సినిమాను చేయగలడా అని అంతా అనుకున్నారు.

ఎంత చేసినా కూడా బాహుబలి స్థాయిని టచ్‌ అవ్వడం అసాధ్యం.అది అందరికి తెలిసిన విషయం.

కాని బాహుబలి సినిమా తర్వాత మరీ లో రేంజ్‌ కాకుండా ఒక మంచి సినిమా చేయాలని ప్రభాస్‌ అభిమానులు కోరుకున్నారు.సాహో చిత్రం దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.

Advertisement

బాహుబలి స్థాయి బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ చిత్రం బాహుబలి స్థాయిలో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.బాహుబలి చిత్రంతో ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఇది తెలుగు సినిమా అంటూ చర్చించుకున్నారు.

రాజమౌళికి జై తెలుగోడా అంటూ జై కొట్టారు.ఇప్పుడు సాహో చిత్రం చూసిన తర్వాత అబ్బా ఏం సినిమా ఇది తెలుగు వారికి మాత్రమే ఇది సాధ్యం అన్నట్లుగా ఉత్తరాది వారు జై కొట్టడం ఖాయం అంటున్నారు.

బాలీవుడ్‌ స్థాయికి మాత్రం తగ్గకుండా అద్బుతమైన విజువల్స్‌ మరియు యాక్షన్‌ సీన్స్‌తో చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.ఈ చిత్రంలోని విజువల్స్‌ బాలీవుడ్‌ సినిమాల్లో కూడా రాలేదు.భారీ బడ్జెట్‌ చిత్రం అంటే ఏదో ఖర్చు చేశాం అన్నట్లుగా కాకుండా సినిమాలో భారీ తనం కనిపిస్తుంది.

అద్బుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులు ఇదేమైనా హాలీవుడ్‌ సినిమానా అన్నట్లుగా ఉంది.ఖచ్చితంగా ఇది ప్రభాస్‌ ఖాతాలో మరో సెన్షేషనల్‌ మూవీగా నిలుస్తుందని అనిపిస్తుంది.ఇక కథ కూడా అబ్బురపర్చే విధంగా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

కరోనా వల్ల 'డేంజర్'లో యువత..?

ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చి వసూళ్లను రాబట్టనుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు