Maruthi Raja Deluxe : ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న మారుతి!

ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా సినిమాలు ప్రకటించి బాహుబలి క్రేజ్ ను యూజ్ చేసుకున్నాడు.

మూడు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.మరి ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

వీటిలో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూట్ జరుపు కుంటున్నాయి.

వీటితో పాటు డార్లింగ్ మారుతి సినిమా షూట్ కూడా సైలెంట్ గా పూర్తి చేస్తున్నాడు.రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మారుతి పక్కా యాక్షన్ తో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించ బోతున్నాడట.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు నటించాల్సి ఉండగా ఇప్పటికే మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఈ సినిమాకు మూడవ నాయికగా లవర్ ఫేమ్ రిద్ధి కుమార్ ను ఫిక్స్ చేశారట.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ లేకుండానే స్టార్ట్ చేసిన మారుతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ ని ప్రభాస్ పై పూర్తి చేసాడట.అలాగే తాజాగా మూడవ షెడ్యూల్ ని కూడా పూర్తి చేయడంతో ఈయన స్పీడ్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.

ఇంత స్పీడ్ గా సినిమాలు చేస్తుండడం ఈ ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు.మారుతి ప్రభాస్ కు హిట్ ఇస్తాడా లేదా ఈయన కూడా ప్లాప్ ఇస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

చూడాలి మరి ఈ సినిమాను ఎంత త్వరగా రిలీజ్ చేస్తారో.

Advertisement