ప్రామిస్ నిలబెట్టుకున్న ప్రభాస్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే డార్లింగ్ ప్రభాస్( Darling Prabhas ) నటిస్తున్న ఆదిపురుష్( Adipurush movie ) అనే చెప్పాలి.

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మరో వారం తర్వాత రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో నిన్న సాయంత్రం ఆదిపురుష్ ఆంధ్రాలో తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్( Pre Release Event ) జరిగిన విషయం తెలిసిందే.అత్యంత ఘనంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

భారీ స్థాయిలో అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హాజరయ్యారు.అయితే ఈ ఈవెంట్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ను మరింత ఎక్కువ ఖుష్ చేసిన విషయం మాత్రం డార్లింగ్ స్పీచ్ అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈయన ఇంతసేపు మాట్లాడిన సందర్భాలు లేవు.రెండు నిముషాల్లోనే తన స్పీచ్ ను ముగించేవాడు.కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈయన స్పీచ్ చాలాసేపు వినాలని కోరుకుంటారు.

Advertisement

వారి కోరికను ఇన్నాళ్లకు తీర్చారు ప్రభాస్.ఈ ఈవెంట్ లో ప్రభాస్ పెద్ద స్పీచ్ ఇవ్వడమే కాకుండా తాను గతంలో ఇచ్చిన మాటను సైతం నిలబెట్టుకున్నాడు.

తాను ఇచ్చిన మాటను గుర్తు చేసి మరీ ఈ వేదిక పై ప్రస్తావించారు.నేను చెప్పినట్టుగానే రెండు కాదు మూడు సినిమాలు చేస్తున్నాను.

అయితే అలా చేస్తున్నానని రిలీజ్ కానీ లేట్ అయితే నా బాధ్యత కాదు అంటూ నవ్వుతు సెలవిచ్చారు.గతంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఏడాదికి ఒక సినిమా అని నిరాశ చెందేవారు.

అదే విషయంలో ప్రభాస్ ఏడాదికి రెండు చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నట్టు తెలిపాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు