ప్రభాస్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా ?

బాహుబలి రికార్డ్స్ బద్దులుకోట్టడం ఏమిటో కాని ప్రభాస్ ఫ్యాన్స్ మామూలు హడావిడి చేయడం లేదు.

బాహుబలి తెలుగు సినిమాకి అందనంత ఎత్తుకు ఇప్పట్లో అందనంత ఎత్తుకు వెళ్ళింది .

అది గర్వపడదగ్గ విషయం .కాని ఒక్క బాహుబలిని పట్టుకొని ఇతర స్టార్ హీరో ఫ్యాన్స్ తో గొడవ పడితే ఎలా ? బాహుబలి చాలా స్పెషల్ సినిమా .భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారి చిత్రం .ఇది ప్రభాస్ కి ఉన్న మార్కెట్ కంటే చాలా అంటే చాలా పెద్దది .బాహుబలి కేలేక్షన్లు కేవలం ప్రభాస్ వలన వచ్చినవి కావు.ఇప్పుడు ప్రభాస్ నెం.1 హీరో .మహేష్, పవన్, ఎన్టీఆర్ లు ప్రభాస్ ముందు దండగా అని వాదిస్తున్నారు ప్రభాస్ అభిమానులు .అలా అనుకుంటే షారుఖ్ ఖాన్ సినిమాల కంటే కుడా బాహుబలి ఎక్కువ కలెక్ట్ చేసింది కదా .ఇప్పుడు ప్రభాస్ షారుఖ్ కన్నా పెద్దవాడు అయిపోయాడా ? రాజమౌళి, అంత బడ్జెట్, గ్రాఫిక్స్, భారి విడుదల లేకపోయుంటే ప్రభాస్ ఆ కలెక్షన్స్ సాధించేవాడా ? అవతార్ సినిమా మనం హీరో కోసం చుడలేదుగా .అందులో ఉన్న హంగులకి ఆకర్షితులమై వెళ్ళాము .బాహుబలి కుడా అంతే .ఈ విషయం ప్రభాస్ అభిమానులు త్వరగా గమనించాలి .లేదంటే బాహుబలి రెండో భాగం అయిపోయాకా మిగితా హీరోల ఫ్యాన్స్ చేతిలో మాటలు పడాల్సివస్తుంది.

బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న బాబీ...

తాజా వార్తలు