డార్లింగ్ క్రేజ్ ఈ రేంజ్ లోనా.. అమ్మాయిలు కూడా గోడలు దూకి హంగామా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.

బాహుబలి( Bahubali ) సిరీస్ తర్వాత మన డార్లింగ్ క్రేజ్ దేశం దాటి ప్రపంచం మొత్తం వ్యాపించింది.

మరి అలాంటి స్టార్ హీరో సినిమా ఈవెంట్ అంటే ఎలా ఉంటుంది.ముందుగానే ఊహించిన దానికంటే కూడా డబల్ రేట్లు ఫ్యాన్స్ డార్లింగ్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు.

నిన్న తిరుపతి వేదికగా ఆదిపురుష్( Adipurush ) ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది.ఈ ఈవెంట్ కారణంగా తిరుపతి( Tirupati ) నగరంలో ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది.

ఫ్యాన్స్ అనుకున్న దాని కంటే ఎక్కువగా తరలి వచ్చారు.యువత మొత్తం ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ బైక్ పార్కింగ్ చేసి అసలు ఆ బైక్ లు బయటకు కూడా వస్తాయా రావా అనే అనుమానం కలిగేలా పార్కింగ్ చేసారు.

Advertisement

ఇక గ్రౌండ్ లోపల మాత్రమే కాదు బయట కూడా ఫ్యాన్స్ బారులు తీరారు.ఏకంగా అమ్మాయిలు సైతం గోడలు దూకి లోపలకు రావడం, పోలీసులు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయాల్సింది పోయి ప్రభాస్ రాగానే వారు కూడా గుమికూడి చూడడం అందరిని ఆకర్షించాయి.ప్రభాస్ క్రేజ్ ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది.

అంతేకాదు ఈ ఈవెంట్ కోసం క్లాస్, మాస్ ఆడియెన్స్ అనే సంబంధం లేకుండా ఫ్యామిలీస్ తో సహా ఇక్కడకు చేరుకున్నారు.

వీఐపీ లైన్ మొత్తం పోలీస్ కుటుంబాలతో నిండిపోయింది.వర్షం ఆటంకం కలిగిస్తుందేమో అని అనుకున్నారు.కానీ అలాంటిది ఏమీ జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక గ్రౌండ్ లో జెండాలు పట్టుకుని పాటలు వచ్చినప్పుడల్లా జనాలు సైతం కోరస్ లు ఇవ్వడం, జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగి పోయింది.ఈ క్రేజ్ మరే హీరోకు అసాధ్యం అనే చెప్పాలి.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

మొత్తం మీద ఆదిపురుష్ ఈవెంట్ ను సక్సెస్ చేసిన ఫ్యాన్స్ సినిమాకు ఎలాంటి సక్సెస్ ఇస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు