Prabhas Movies: ఒకేసారి మూడు ఫినిష్ చేస్తున్న డార్లింగ్.. మిగతా హీరోల కంటే టాప్ ఈయనే!

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు.

ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ సినిమాలతో వచ్చాడు.కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం అందుకోలేదు.

ఇక ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఇక ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.

అందులో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.

Advertisement
Prabhas Busy Juggling Between Three Projects Salaar Project K Details, Prabhas,�

మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Prabhas Busy Juggling Between Three Projects Salaar Project K Details, Prabhas,�

దీంతో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా.ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Prabhas Busy Juggling Between Three Projects Salaar Project K Details, Prabhas,�
Advertisement

ఇక ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.ఈ సినిమా కూడా సైలెంట్ గా షూట్ జరుపు కుంటుంది.ఇలా ప్రభాస్ ఏ స్టార్ హీరో కూడా చేయనన్ని సినిమాలు ఒకేసారి షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

మూడు సినిమాలను బ్యాలెన్స్ గా షూట్ పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

తాజా వార్తలు