ఫుల్ యాక్షన్ తో 'ఆదిపురుష్' సెకండ్ ట్రైలర్.. మరింత హైప్ ఖాయం!

ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్ లుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్( Adipurush ).ఈ పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో మరొక పది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

అందుకే మరింత ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ రావడానికి కారణం ట్రైలర్ అనే చెప్పాలి.

ఈ తర్వాత తర్వాత నుండి ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చిన ఆకట్టు కుంటుంది.వరుసగా అప్డేట్ లను ఇస్తూ మేకర్స్ కాస్త పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేయడంలో సఫలం అయ్యారు.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ఈ సాంగ్స్ వల్లనే ఆదిపురుష్ సినిమాకు ఇంకా హైప్ పెరిగింది అనే చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ఉందని ఎప్పటి నుండో టాక్ వస్తున్న ఇప్పుడు ఈ రెండవ ట్రైలర్( Adipurush Second Trailer ) గురించి అప్డేట్ వస్తుంది.

Advertisement

మరి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ ట్రైలర్ ఫుల్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారట.ఈ ట్రైలర్ అయితే ఈసారి నెక్స్ట్ లెవల్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది అని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్( Adipurush Pre Release Event ) జరుపుకోనుంది.మరి ఆ ఈవెంట్ లోనే సెకండ్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు అని టాక్.భారీ అభిమానుల మధ్య ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఈ ట్రైలర్ 30 సెకన్ల నిడివితో ఉంటుందని ఫస్ట్ ట్రైలర్ కంటే మరింత ఎక్కువ హైప్ తెచ్చేలా కట్ చేసారని అంటున్నారు.

చూడాలి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు