ఈ రూమర్ నిజమేనట.. ప్రభాస్ జోడీగా ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!

మారుతీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ప్రెసెంట్ మారుతీ గోపీచంద్ హీరోగా యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే పక్కా కమర్షియల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు మారుతి.ఈ సినిమా అయిన వెంటనే మారుతీ ఏకంగా డార్లింగ్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసాడు.

ఎవ్వరు ఊహించని కాంబో తెరపైకి రావడంతో అందరు షాక్ అయ్యారు.ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.

ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

Advertisement

ఇవి పూర్తి అయ్యే వరకు మరొక సినిమా ఉండదు అని అంతా అనుకున్నారు.కానీ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అని తెలిసి అందరు ఆశ్చర్య పోయారు.

మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాని మారుతి ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందట.హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters

మేకర్స్ ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారని టాక్. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్ బయటకు వచ్చింది.ఈ ముగ్గురు హీరోయిన్స్ లలో అనుష్క కూడా ఉంది అనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Advertisement

అయితే ఈ రూమర్ గురించి ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.వస్తున్నా సమాచారం ప్రకారం ఈ రూమర్ నిజం అని తెలుస్తుంది.ప్రభాస్, అనుష్క కాంబో అంటే ఎలాంటి సంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి అనుష్క ఓకే అయితే కనుక మరొక మిర్చి హిట్ ఖాయం అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.