ఆదిపురుష్‌ ఫైనల్ ట్రైలర్‌ కి ఫ్యాన్స్‌ టాక్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్( Young Rebel star prabhas ) హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush movie ) మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్( Pre-release event ) ను వైభవంగా తిరుపతిలో నిర్వహించడం జరిగింది.

ఆ కార్యక్రమానికి వచ్చిన ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ కార్యక్రమంలో ఆదిపురుష్ యొక్క ఫైనల్‌ ట్రైలర్‌( Final trailer ) ను రిలీజ్ చేయడం జరిగింది.

తిరుపతి ఈవెంట్‌ లో విడుదలకు కొన్ని నిమిషాల ముందు యూట్యూబ్‌ ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది.యూట్యూబ్‌ లో ట్రైలర్ చూసిన అభిమానులు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

సినిమా టీజర్‌ వచ్చిన సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.టీజర్‌ విడుదల సమయంలో ఇదేం సినిమా అంటూ పెదవి విరిచారు.దాంతో అదనంగా ఆరు ఏడు నెలల సమయం తీసుకుని గ్రాఫిక్స్ వర్క్‌ చేయడం జరిగింది.

Advertisement

ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ తో ఒక్క సారిగా మొత్తం మార్చేశారు.ఆదిపురుష్‌ సినిమా యొక్క స్థాయి ని యూనిట్‌ సభ్యులు ట్రైలర్‌ తో మార్చేయడం జరిగింది.

ఇప్పుడు ఫైనల్‌ ట్రైలర్ అంటూ కొత్తగా ఈ ట్రైలర్‌ ను తీసుకు వచ్చారు.ఈ ట్రైలర్ లో యాక్షన్‌ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.అయితే కొందరు మాత్రం ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇదెక్కడి ట్విస్ట్‌ ఓం అంటూ కొందరు ఆయన్ను ట్యాగ్ చేసి సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ట్రైలర్‌ స్థాయి లో ఫైనల్ ట్రైలర్‌ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌ గా ఉంది.ఆదిపురుష్‌ ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంతా భావించారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అనుకున్నట్లుగానే జరిగింది.అయితే ఫైనల్‌ ట్రైలర్ విషయంలో కాస్త అంచనాలు తారు మారు అయ్యాయి.

Advertisement

సినిమా మరో వారం రోజుల్లో రాబోతుంది కనుక ఏం జరగబోతుందో చూడాలి.

తాజా వార్తలు