ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ టాక్‌ షోలో అనుష్క గురించి ప్రభాస్‌ ఏమన్నాడంటే..!

ఇండియాలోనే అతి ఫేమస్‌ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ అని చెప్పుకోవచ్చు.

కరణ్‌ జోహార్‌ ప్రముఖుల నుండి నిజాలు రాబట్టడంలో ఇప్పటికే చాలా సార్లు సక్సెస్‌ అయ్యాడు.

ఎన్నో ప్రేమ విషయాలను, ఎన్నో ఇల్లీగల్‌ విషయాలను ఆయన రాబట్టిన విషయం తెల్సిందే.తాజా సీజన్‌లో కరణ్‌ పలువురు ప్రముఖులతో చిట్‌ చాట్‌ నిర్వహించడం జరిగింది.

అయితే ఇప్పటి వరకు బాలీవుడ్‌ స్టార్స్‌తో మాత్రమే టాక్‌ షో నడిపిన కరణ్‌ జోహార్‌ మొదటి సారి సౌత్‌ స్టార్స్‌ను తన షోకు తీసుకు వచ్చాడు.

సౌత్‌లో బాహుబలి చిత్రంతో బాలీవుడ్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి, ప్రభాస్‌, రానాలను ఈ షోలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.ఈ షో వచ్చే ఆదివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

ఈ షోలో ప్రభాస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను కరణ్‌ రాబట్టినట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.ప్రోమోలో చాలా విషయాలను టచ్‌ చేసినట్లుగా చూపించారు.ముఖ్యంగా అనుష్కతో ఉన్న ప్రేమ విషయాన్ని గురించి ప్రభాస్‌ క్లారిటీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అనుష్కతో ఎంతో కాలంగా ప్రభాస్‌కు ప్రేమ ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది.అయితే ఆ వార్తల్లో నిజం లేదు అంటూ చెబుతూనే ఉన్నారు.కాని వారి మాటలను మాత్రం జనాలు నమ్మడం లేదు.

తాజాగా ప్రభాస్‌ ఈ షోలో ప్రభాస్‌ తమ ప్రేమ గురించి ఏం చెప్పాడు అనే విషయంపై ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌తో తేలిపోతుంది.ప్రోమోలో మాత్రం అనుష్కతో ప్రేమ సంగతి ఏంటీ అంటూ ప్రశ్నించగా మీరు పుకార్లను ప్రచారం చేయవద్దు అంటూ ప్రభాస్‌ చెప్పడం చూపించారు.

అసలు విషయం మాత్రం ఆదివారం ఎపిసోడ్‌లో తేలిపోయే అవకాశం ఉంది.

మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్
Advertisement

తాజా వార్తలు