ఆదిపురుష్ లో ప్రభాస్ ను చూస్తామా? లేదా?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతోంది.

సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమా ను దాదాపుగా అయిదు వందల కోట్ల కు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు.మేకింగ్ కు 150 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వగా గ్రాఫిక్స్ వర్క్‌ కు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా పూర్తిగా మోషన్ గ్రాఫిక్స్ తో ఉంటుందని అంటున్నారు.అప్పట్లో రజినీకాంత్‌ కొచ్చాడియాన్ అనే సినిమా వచ్చింది కదా అలాగే ఈ సినిమా ఉంటుందేమో అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొచ్చాడియన్‌ సినిమా కోసం రజినీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.తీరా చూస్తే ఆ సినిమా లో రజినీకాంత్‌ లేడు.

Advertisement

రజినీకాంత్‌ లా కనిపించిన యానిమేషన్ క్యారెక్టర్ ఉంది.అంతా నోరు వెళ్లబెట్టారు.

ఓర్నీ మరీ ఇలా ఉందేంటి అంటూ చాలా మంది ఫీల్ అయ్యారు.ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా లో కూడా ప్రభాస్ కనిపిస్తాడా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్‌ ఎనిమిది అడుగుల ఎత్తు కనిపిస్తుందని.అంటే ఏదో తేడా కొడుతుంది అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలు అయ్యింది.

నిజానికి ప్రభాస్ పాత్ర ను రాముడిగా చూపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.కాని అది ఎలా అనేది మాత్రం సినిమా నుండి ఫస్ట్‌ లుక్ వచ్చే వరకు క్లారిటీ ఉండదు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

సినిమా షూటింగ్‌ కొన్ని రోజులే పట్టింది.కనుక అసలు ఒరిజినల్‌ క్యారెక్టర్స్ కథలో ఉంటాయా అనేది కూడా చూడాలి.

Advertisement

ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

తాజా వార్తలు