ఆ డిజాస్టర్ మూవీ తర్వాత సినిమాలు మానేయాలనుకున్న పవన్.. చివరకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానించే స్టార్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.

ఎంతో టాలెంటెడ్ హీరో అయినప్పటికీ తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ అస్సలు ఇష్టపడరు.

పుస్తకాలు చదవడాన్ని పవన్ కళ్యాణ్ ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.ఒక సందర్భంలో పవన్ మాట్లాడుతూ నాకు ఊహ తెలిసే సమయానికి చిరంజీవి అన్నయ్య డిగ్రీ స్టూడెంట్ అని సెలవుల్లో మాత్రమే అన్నయ్య ఇంటికి వచ్చేవారని చెప్పుకొచ్చారు.

అన్నయ్యతో కలిసి ఊళ్లో బైక్ పై తిరిగిన రోజులను నేను సులువుగా మరిచిపోలేనని పవన్ తెలిపారు.నాగబాబు అన్నయ్యను ఏం కావాలన్నా అడిగేవాడినని నాగబాబు అన్నయ్య దగ్గర చనువు ఎక్కువని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.

నాన్న నిజాయితీపరుడు కావడంతో ఉద్యోగం చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు.ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని పవన్ చెప్పుకొచ్చారు.

Advertisement

నేను ఇంటర్ లో చేరే సమయానికి అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డారని ఎనిమిదో తరగతి నుంచి నాకు పరీక్షల్లో తప్పడం అలవాటైందని ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యానని పవన్ చెప్పుకొచ్చారు.ఇంట్లో వాళ్లు ఏమీ అనకపోవడంతో అపరాధభావం ఎక్కువై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.నా తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చివరి సినిమా కావాలని అనుకున్నానని పవన్ తెలిపారు.

ఆ తర్వాత మొహమాటం కొద్దీ రెండో సినిమాకు ఓకే చెప్పానని పవన్ తెలిపారు.జాని సినిమా తర్వాత సినిమాలు మానేయాలని అనుకున్నానని కానీ సాధ్యపడలేదని పవన్ అన్నారు.ఈ ఒక్క సినిమా చేసేయ్ అంటూ కుటుంబం ముందుకు నెట్టడంతో ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ వచ్చానని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు