ఆ మూడు సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు లేదట.. ఏం చెప్పారంటే?

2024 సంవత్సరంలో పవన్ నటించిన సినిమాలేవీ రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే.

షూటింగ్స్ పూర్తి కాకపోవడం, పవన్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల సినిమాలేవీ రిలీజ్ కాలేదు.

అయితే పవన్ మాత్రం తన సినిమాల వాయిదాల విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పుకొచ్చారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(power star pawan kalyan) వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

నేను ఇచ్చిన సమయానికి వాళ్లు షూటింగ్ ను పూర్తి చేయలేదని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చెప్పుకొచ్చారు.చెప్పిన సమయం తర్వాత నేను చేయలేనని వాళ్లకు ముందే చెప్పానని పవన్ అన్నారు.

అభిమానులు ఓజీ ఓజీ( OG, OG) అని అరుస్తుంటే అవి నాకు అరుపులలా అనిపించడం లేదని బెదిరిస్తున్నట్టు అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.బాంబే బ్యాక్ డ్రాప్ (Bombay backdrop)కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని పవన్ చెప్పుకొచ్చారు.

Advertisement

ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(Gang Star) అంటారని అయితే ఓజీ (Ozzy)అంటే ఓజాస్ గంభీర్(OG Gambhir) అని అర్థం వస్తుందని పవన్ కామెంట్లు చేశారు.ఓజీ సినిమాను నేనే దగ్గరుండి పుష్ చేశానని నాతో సంబంధం లేని సన్నివేశాలను ముందుగానే పూర్తి చేయమని చెప్పానని పవన్ తెలిపారు.ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) కు డేట్స్ ఇచ్చానని అయితే నేను ఇచ్చిన సమయానికి స్క్రిప్ట్ సిద్ధం కాలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమాకు సంబంధించి 9 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ప్రీ విజువలైజేషన్ వర్క్ నడుస్తోందని పవన్ పేర్కొన్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.2025 సంవత్సరం పవన్ అభిమానులకు మరింత స్పెషల్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు