అప్సర హత్య కేసులో కీలకం కానున్న పోస్ట్‎మార్టం రిపోర్ట్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన అప్సర హత్య కేసులో పోస్ట్‎మార్టం రిపోర్ట్ కీలకం కానుంది.

గర్భవతిగా ఉన్న అప్సరను పూజారి సాయికృష్ణ హత్య చేశాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్సర గర్బంపై ఇద్దరి మధ్య వివాదం మొదలైందని తెలుస్తోంది.మొదటిసారి అప్సర గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడని సమాచారం.

రెండో సారి అప్సర గర్భం దాల్చడంతో వివాదం పెరిగిందని ఈ క్రమంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్సర పోస్ట్‎మార్టం రిపోర్ట్ వస్తే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

కాగా ఇప్పటికే నిందితుడు సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide