MLA Lasyanandita : ఎమ్మెల్యే లాస్యనందిత పోస్టుమార్టం నివేదిక విడుదల..!

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత( MLA Lasyanandita ) మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఆమె మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ క్రమంలో లాస్య నందిత పోస్టుమార్టం నివేదికను వైద్యులు వెల్లడించారు.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు.

లాస్య నందిత ఆరు దంతాలు ఊడిపోయాయని, ఎడమ కాలు పూర్తిగా విరిగిందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు.దాంతో పాటు లాస్య తలకు బలమైన గాయం అయిందని, శరీరంలో ఎముకలు డ్యామేజ్ అయ్యాయని నివేదికలో వైద్యులు వెల్లడించారు.

దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు తెలిపారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు