చిన్న చిన్న విషయాలకే అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం..!

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు ఆఫీస్ ఒత్తిడి, పని భారం వల్ల మానసికంగా అలసిపోతున్నారు.చెడు ఆలోచనలు రావడం మొదలవుతున్నాయి.

ఏదైనా ఒక విషయం గురించి అనవసరంగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు.కానీ అతిగా ఆలోచించే( Over Thinking ) అలవాటు వ్యక్తి ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది మానసికంగా, శరీరకంగా మరింత కుంగ దీస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడినప్పుడు, ఏదైనా అంశం గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు కార్టిసాల్ ( Cartisol Harmone ) అనే హార్మోన్ శరీరంలో విడుదలవుతుంది.

Possibility Of Getting These Dangerous Diseases By Over Thinking Details, Over T

ఈ హార్మోన్ రక్తంలో చక్కర స్థాయిని పెంచుతుంది.ఈ ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిని( Sugar Levels ) భారీగా పెంచుతుంది.ఈ కారణంగానే మధుమేహ రోగులకు ఒత్తిడి నిర్వహణ పై ప్రత్యేకంగా ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తూ ఉంటారు.

Advertisement
Possibility Of Getting These Dangerous Diseases By Over Thinking Details, Over T

శరీరంలోని మొత్తం నాడి వ్యవస్థ( Nervous System ) బలమైన సమాచార వ్యవస్థగా పనిచేస్తుంది.అయితే అతిగా ఆలోచించడం, ఒత్తిడికి గురవడం ద్వారా అదే సందేశం నరాలలో ప్రసారం చేయబడుతుంది.

ఇది గుండె శ్వాసకోశ వ్యవస్థను ఎంతో ప్రభావితం చేస్తుంది.

Possibility Of Getting These Dangerous Diseases By Over Thinking Details, Over T

ముఖ్యంగా చెప్పాలంటే ఒత్తిడితో బాధపడేవారు సులభంగా అనారోగ్యానికి లోనవుతారని వైద్యులు చెబుతున్నారు.ఒక్కొక్కసారి పక్షవాతం ( Paralysis ) కూడా వచ్చే అవకాశం ఉంది.ఒత్తిడికి గురవడం వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది.

ఈ కారణంగా ధమని లో వాపు సంభవించవచ్చు.ఇది గుండెకు హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అందుకే అతిగా ఆలోచించడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు.ఒత్తిడి,అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

Advertisement

అందుకే ఒత్తిడి నుంచి బయట పడేందుకు రోజు వ్యాయామం చేయడం యోగా సనాలు చేయడం ఎంతో మంచిది.

తాజా వార్తలు