పోర్టబుల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి.. ఆ వివరాలు ఇవే..

జాకరీ ఎక్స్‌ప్లోరర్ 3000ప్రో( Zachary Explorer 3000 Pro ) అనే ఈ పోర్టబుల్ పవర్ స్టేషన్ తాజాగా మార్కెట్లో రిలీజ్ అయింది.3024wh సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది.

దానిని ట్రావెల్స్, ఔట్‌డోర్ ఫంక్షన్స్, ఇంట్లో అత్యవసర అవసరాలకు ఉపయోగపడుతుంది.

ఇది మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, టీవీ, లైట్లు, హీటర్లు, మైక్రోవేవ్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ లాంటి అనేక పరికరాలకు పవర్ సప్లై చేయగలదు.జాకరీ ఎక్స్ ప్లోరర్ అనేది ఇంట్లో ఉంటే పవర్ లేకపోయినా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో కరెంటు పోయినప్పుడు ఛార్జింగ్ లైట్ కోసం వెతుకుతుంటాం.అలాంటి సమయంలో జాకరీ ఎక్స్ ప్లోరర్ 3000 ప్రో మనకు సహాయపడుతుంది.ఇది ఒక సోలార్ జనరేటర్( Solar generator ) అని చెప్పుకోవచ్చు.

ఇది సోలార్ ప్యానల్ సహాయం తో కేవలం మూడునాలుగు గంటలోనే ఛార్జ్ అవుతుంది.ఈ జాకరీ ఎక్స్ ప్లోరార్ 3024 వాట్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది.

Advertisement

దీనికి యూఎస్బి పోర్టులతో పాటు రకరకాల పనికరాలకు సంబంధించిన ప్లగ్స్ ఉంటాయి.దీని సహాయం తో కేవలం ల్యాప్‌టాప్స్‌, ఫోన్స్ ఏ కాకుండా టీవీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ లాంటి వాటిని కూడా సులభంగా వాడుకోవచ్చు.

అయితే ఎండ తక్కువ ఉన్నా కూడా పనిచేయగలగడం ఈ సోలార్ ప్యానెల్స్ ప్రత్యేకత.ఇది మనం ఎక్కడికైనా క్యాంపైన్ ట్రిప్పులు వెళ్ళినప్పుడు, టైల్ గెటింగ్ లాంటి ఎమర్జెన్సీ బ్యాకప్స్ పవర్స్ కి సరిగా సరిపోతుంది .ఈ జాకరిబ్యాటరీ సోలార్ ద్వారా 4 గంటల్లో ఛార్జ్ అయితే, వాల్ ఛార్జింగ్ ద్వారా 2:30 గంటల్లోనే ఛార్జ్ అవుతుంది.ఎలాంటి ప్రదేశంలో అయినా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది.

ఈ జాకరి ఉంటే అసలు పవర్ ఉండదేమో అనే భయం మనకు ఉండదు.ఔట్‌డోర్ ఫంక్షన్స్ కి అయితే ఈ బ్యాటరీ పర్ఫెక్ట్ అనే చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు