ఐపీఎల్ లో పేలప ఆట ప్రదర్శన.. భారత జట్టులో అవకాశం దక్కేనా..!

ఐపీఎల్ లీగ్ అనేది క్రికెట్ లో తమ సత్తా ఏంటో చూపించుకోవడానికి ఓ మంచి ప్లాట్ఫామ్.

ఐపీఎల్ లో సత్తా చాటితే భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు చాలా ఎక్కువ.

అందుకే కొత్త ఆటగాళ్లు ఐపీఎల్ లో అంచనాలకు మించి అద్భుత ఆటను ప్రదర్శిస్తుంటారు.అజింక్య రహనే టీమ్ ఇండియాలో చోటు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ఐపీఎల్ సీజన్లో తన సత్తా ఏంటో చూపించి డబ్ల్యూటీసి ఫైనల్ కు భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు.ఇక యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు అద్భుత ఆటను ప్రదర్శించారు.

వీరికి భవిష్యత్తులో భారత జట్టులో కచ్చితంగా అవకాశాలు దక్కుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఐపీఎల్ కొందరు ఆటగాళ్లకు కలిసి వస్తే.

Advertisement
Poor Performance In IPL Will He Get A Chance In The Indian Team, Deepak Hooda,

మరికొందరి ఆటగాళ్లకు కొంప ముంచిందని చెప్పాలి.ఈ ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆట ప్రదర్శించి భారత జట్టులో చోటు దక్కకుండా కెరీర్ దాదాపుగా ముగిసిపోయిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

దీపక్ చాహార్: చెన్నై( Chennai ) జట్టు తరఫున తొమ్మిది మ్యాచ్లలో ఆడి 12 వికెట్లు తీశాడు.గాయాల కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న దీపక్ కు అతని ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ఐపీఎల్ కు లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయ్యాడు.పరిస్థితుల దృష్ట్యా భారత జట్టులో అవకాశం దక్కడం చాలా కష్టమే.

Poor Performance In Ipl Will He Get A Chance In The Indian Team, Deepak Hooda,

దీపక్ హుడా: ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు( Lucknow team ) తరుపున ఆడి పేలవ ఆటను ప్రదర్శించాడు.12 మ్యాచ్లలో ఆడి 7.64 సగటుతో 84 పరుగులు చేశాడు.దాదాపుగా దీపక్ హుడా కెరీర్ ముగిసినట్టే.రాహుల్ త్రిపాఠి: ఐపీఎల్( IPL ) సీజన్లో ఫామ్ కోల్పోయాడు.13 మ్యాచ్లలో 22.75 సగటుతో 273 పరుగులు చేశాడు.చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒకటో రెండో ఉన్నాయి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

కాబట్టి భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు.

Poor Performance In Ipl Will He Get A Chance In The Indian Team, Deepak Hooda,
Advertisement

సర్పరాజ్ ఖాన్: దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఇతను ఈ సీజన్లో ఢిల్లీ( Delhi ) జట్టు తరఫున నాలుగు మ్యాచ్లలో 13.25 సగటుతో 53 పరుగులు చేశాడు.ఇతడు కూడా భారత జట్టులో చోటు దక్కే అవకాశం కోల్పోయినట్టే.పృథ్వీ షా: ఇతను కూడా ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 8 మ్యాచ్లలో 13.25 సగటుతో 106 పరుగులు చేశాడు.ఇతనికి కూడా భారత జట్టులో చోటుదకే అవకాశం దాదాపుగా లేనట్టే.

తాజా వార్తలు