హీరో కంటే ఎక్కువే పుచ్చుకుంటోన్న పూజా

టాలీవుడ్‌లో ప్రస్తుతం ది మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా అందాల భామ పూజా హెగ్డే మారింది.కెరీర్ తొలినాళ్లలో ఆమెను ఐరన్ లెగ్ అని అందరూ అన్నారు.

కానీ అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రంతో అమ్మడికి అదృష్టం లక్క పట్టుకున్నట్లు పట్టుకుంది.ఈ ఒక్క సినిమాతో అమ్మడు గోల్డెన్ లెగ్ అనే ముద్రను వేసుకుంది.

ఇక ఈ సినిమా తరువాత అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడంతో ఆమె డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలే కాకుండా చిన్న హీరోలు సైతం పూజా హెగ్డేతో కలిసి చేయాలని కోరుకుంటున్నారు.

ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో బొంబాట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు కుర్ర హీరో అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాలో పూజా పుచ్చుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Advertisement

అఖిల్ కంటే ఎక్కువగా ఈ సినిమాలో పూజా రెమ్యునరేషన్ తీసుకుంటోంది.దీంతో పూజా డిమాండ్‌కు అనుగుణంగా తన రెమ్యునరేషన్‌ను కూడా పెంచేసినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని పూజా డిసైడ్ అయ్యింది.అందుకే అమ్మడు అదిరిపోయే రేటును కోట్ చేస్తుందని, అది చెల్లించేందుకు కూడా నిర్మాతలు వెనుకాడటం లేదని సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు