"దేవర"ని రిజెక్ట్ చేసి పెద్ద గండం నుంచి తప్పించుకున్న స్టార్ హీరోయిన్..?

కొరటాల శివ( Koratala Shiva ) చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు.

ఆయన ఇంతకుముందు తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

ఈ దర్శకుడు వరుసగా హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు.ఎన్టీఆర్ తో ఓ పెద్ద హిట్ కొట్టాడు.

కానీ దేవరాజ్ సినిమా విషయంలో ఆయన తడబడ్డాడు.భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా తీయాలనే తాపత్రయంతో ఆయన తన బలాలను పూర్తిగా మిస్ యూజ్‌ చేసుకున్నాడు.

తన సినిమా కథలకు పెద్దగా నప్పని భారీ ఫైట్ సీక్వెన్స్‌లపై పూర్తి స్థాయిలో ఆధారపడి దెబ్బయిపోయాడు.పాన్ ఇండియా, బాహుబలి లాంటి హిట్ కొట్టాలనే మోజులో దేవర సినిమాని చాలా వరస్ట్ గా తీశాడు.

Advertisement

ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మీడియా ముందుకి వచ్చి, కథ, కథనం అసలు బాగోలేదని, అవుడేటెడ్ స్టోరీ అని రివ్యూలు ఇస్తున్నారు.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్‌లో బాగా చేశాడని, బిజిఎమ్ మాత్రం అద్భుతంగా ఉందని కూడా పోగొడుతున్నారు.ఇదే సమయంలో జాన్వీ కపూర్ రోల్ చెత్తగా ఉందని కూడా అంటున్నారు.

ఆమెను గ్లామర్ షో కోసం మాత్రమే తీసుకున్నారని, ఆ నటికి పెద్దగా డైలాగులు లేవని, క్యారెక్టర్జేషన్ దారుణంగా ఉందని చెబుతున్నారు.దేవర లాంటి పెద్ద మూవీలో చేసినా ఆమెకు ఇలాంటి విమర్శలు ఎదురయ్యాయి.

ఈ పాత్ర చేసినందుకు ఆమెకు బాగా నెగిటివిటీ కూడా వస్తుంది.ఇది ఆమె కెరీర్ కు ప్లస్ కావడం దేవుడు ఎరుగు గానీ చాలా పెద్ద మైనస్ అయ్యిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

నా ఇంట్లో నాగవంశీ ఫోటో పెట్టుకుంటాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!
ఆ రెండు శాఖలపై చంద్రబాబు ఫోకస్ .. నేడు సమీక్ష

అయితే ఇంత పెద్ద గండం నుంచి ఒక హీరోయిన్ కొద్ది తప్పించుకుని బతికిపోయింది.ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే( Pooja Hegde ).దేవరలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని దర్శకుడు కొరటాల శివ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు.

Advertisement

ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుందని అంచనాలు పెంచేశాడు.రెండు పేజీల డైలాగ్ కూడా జాన్వీ చేత కొరటాల శివ చెప్పించాడని తెలిపాడు.కానీ సినిమాలో ఆమెకు నాలుగైదు డైలాగులే ఉన్నాయి.

అవి కూడా చాలా చిన్నవి.అసలు సినిమాలో ఆమె పాత్ర లేకపోయినా కథపై కొంచెం కూడా ఎఫెక్ట్ పడి ఉండేది కాదు.

పాటల్లో మాత్రమే జాన్వీ కపూర్ కనిపించింది.అందుకే చాలామంది తెలుగు ఫ్యాన్స్ "శ్రీదేవి కూతురికి ఇలాంటి చెత్త క్యారెక్టర్ ఎలా ఇస్తారు?" అని ప్రశ్నిస్తున్నారు.ఇది చాలా అన్యాయం అని కూడా ఫైర్ అవుతున్నారు.

అయితే ముందుగా ఈ పాత్రలో పూజా హెగ్డేనే తీసుకోవాలని కొరటాల శివ బాగా ప్రయత్నించాడట.కానీ ఆమె మాత్రం ప్రతిసారి నో చెప్పిందట.

కారణాలు తెలియదు కానీ ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని తెలిసింది.సినిమా రిలీజ్ అయ్యాక పూజా హెగ్డే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

దేవర సినిమాని రిజెక్ట్ చేసి పూజా మంచి పని చేసిందని, లేకపోతే ఆమె కెరీర్‌కు ఎండ్‌ కార్డు పడి ఉండేది అని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు