Actor Ponnambalam: చిరు, ఉపాసన గురించి స్పందించిన నటుడు పొన్నంబలం.. షాక్ అయ్యానంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, విలన్ పొన్నబలం( Actor Ponnambalam ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తమిళం తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు పొన్నబలం.

మొదట స్టంట్ మాస్టర్ గా కెరిర్ ని మొదలు పెట్టి ఆ తరువాత నటుడిగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

చిరంజీవితో( Chiranjeevi ) పాటు స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించారు పొన్నబలం. ఇది ఇలా ఉంటే ఇటీవల ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతుండడంతో మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహాయం చేసిన తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొన్న పొన్నబలం ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పొన్నబలం మాట్లాడుతూ.కిడ్నీలు పాడైపోయి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాను.

Advertisement

శరత్ కుమార్, ధనుష్ వంటి హీరోలు కొంత డబ్బు ఇచ్చి సహాయం చేసినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా మారడానికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది.అలాంటి పరిస్థితిలో చిరంజీవి గుర్తుకు వచ్చి ఆయనకి ఫోన్ చేశాను.

ఆయన ఏదో కొంత డబ్బు ఇచ్చి సహాయం చేస్తారు అనుకున్నాను.

కానీ నా పరిస్థితి విన్న ఆయన వెంటనే నా అకౌంట్ కి కొంత డబ్బుని పంపించారు.నన్ను వెంటనే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు అని తెలిపారు పొన్నబలం.అయితే చిరంజీవి ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికే పొన్నంబలంకి మరో ఫోన్ కాల్ వచ్చింది.

ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగా.నేను రామ్ చరణ్ వైఫ్ ఉపాసనని.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

( Upasana ) మావయ్య మీ గురించి చెప్పారు.మీరు వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి వెళ్ళండి అని ఉపాసన ఫోన్ చేసి చెప్పారు.

Advertisement

ఆమె నుంచి ఫోన్ కాల్ రావడంతో నేను షాక్ అయ్యాను.అలా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తో కలిపి హాస్పిటల్ మొత్తం ఖర్చు దాదాపు 58 లక్షలు అయ్యిందట.

అయితే ఆ మొత్తాన్ని చిరంజీవి కట్టినట్లు తెలిపారు పొన్నబలం.

తాజా వార్తలు