Prathyusha: సినీ సెలబ్రిటీలు నటి ప్రత్యూష చనిపోతే నోరు తెరవక పోవడానికి కారణం ఆ రాజకీయ నాయకుడేనా..?

నటి ప్రత్యూష ( Prathyusha ) ఇప్పటి జనరేషన్ కి ఈ హీరోయిన్ తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఈమె హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉండేది.ఇక ఈమె హీరోయిన్ గా కాకుండా కొన్ని కీలక పాత్రల్లో నటించి ఎక్కువ ఫేమస్ అయ్యింది.

అలా శ్రీరాములయ్య ( Sri Ramulayya ) , రాయుడు, కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించి ప్రత్యూష మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే అలాంటి ప్రత్యూష మరణం ఇప్పటికి కూడా ఒక మిస్టరీనే.ఈమె అనుమానాస్పదంగానే మరణించింది.

కానీ ప్రత్యూష తన స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి( Siddharth Reddy ) ఇద్దరు కోకాకోలాలో విషం కలుపుకొని తాగి చనిపోయారు అంటూ ఎన్నో ప్రముఖ పత్రికలు ఈమె మరణించిన సమయంలో వార్తలు రాశారు.

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఆమె తల్లి కొట్టిపారేసింది.తన కూతురిని చిత్రహింసలు పెట్టి టార్చర్ చేసి చంపారని కూడా ఆరోపించింది.ఇక 17 ఏళ్లలోనే మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వచ్చిన ప్రత్యూష మరణం వెనుక ఎన్నో రకాల అనుమానాలు తెర మీద వినిపించాయి.

Advertisement

ఈమె లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్( Prathyusha Suicide ) చేసుకొని మరణించింది అని కొంతమంది అంటే, లేదు లేదు కావాలనే కొంతమంది ఆమెను టార్చర్ చేసి చంపారని ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ఆమె చనిపోయిన సమయంలో వార్తలు వైరల్ చేశారు.అయితే ప్రత్యుష మరణం వెనుక కొంతమంది బడా బడా రాజకీయ నాయకులు ( Politicians ) ఉన్నారట.

ఈ కారణంతోనే సినీ ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు.కానీ ఈమె చనిపోయిన సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎవరూ కూడా మాట్లాడకపోవడంతో చాలా నెగిటివ్ వార్తలు( Negative Comments ) వచ్చాయి.

ఎందుకంటే ఒక మామూలు నటి కాబట్టి ఆమె మరణాన్ని ఎవరు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.

అదే ఒక స్టార్ హీరో కూతురో లేదా స్టార్ హీరోయినో అయితే సినీ ఇండస్ట్రీ (Film Industry) ఇలాగే సైలెంట్ గా ఉండేదా అని ఎంతోమంది ఈమె మరణం పై స్పందించకపోవడంతో సినీ ఇండస్ట్రీని దుమ్మెత్తి పోసారు.కానీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు సైతం ఈమె మరణం వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని వారికి భయపడే నోరు తెరవడం లేదు అని అప్పట్లో టాక్ వినిపించింది.

పాతిక లక్షల సహాయం అబద్దం.. కాంగ్రెస్ రెబల్ లీడర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు