రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలను అడ్డుకున్న పోలీసులు

విజయవాడ( Vijayawada )లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

టీడీపీ నేత వంగలపూడి అనిత( Anitha Vangalapudi ) ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులు వివరించేందుకు ఐలాపురం హోటల్‌కు బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.వంగలపూడి అనిత, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

అయితే సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.మహిళలపై దాడులు, సోషల్ మీడియాలో మహిళలను వేధింపులపై సమావేశం జరుగుతుంటే ఎందుకు అనుమతి లేదంటూ టీడీపీ( TDP ), జనసేన మహిళా నేతలు ప్రశ్నించారు.

తామ శాంతియుతంగానే వెళ్లి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మహిళా నేతలు చెబుతున్నారు.ఆ తర్వాత అనుమతి ఇవ్వడంతోని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి అందజేశారు వనిత.

Advertisement
ఫిబ్రవరిలో ఓటిటీలో విడుదల కాబోయే సినిమాలు ఇవే?

తాజా వార్తలు