Taapsee Pannu : వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ తాప్సీ.. కేసు నమోదు చేసిన పోలీసులు?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసి అక్కడ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది.మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది.

ఆ తర్వాత వస్తాడు నా రాజు , గుండెల్లో గోదారి,దరువు, మిస్టర్ పర్ఫెక్ట్,వీర, మొగుడు, షాడో, సాహసం లాంటి మరిన్ని సినిమాల్లో నటించి మెప్పించింది తాప్సి( Taapsee ).

ఇకపోతే తాప్సీ పన్ను( Taapsee Pannu) చివరగా తెలుగు ప్రేక్షకులను మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలుసిందే.ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి పన్నుకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

Advertisement

అదేమిటంటే.మార్చి 12న ముంబైలో జరిగిన లాక్ మి ఫ్యాషన్ వీక్ 2023 షో( Lock Me Fashion Week 2023 Show )లో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది.

ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువుల ఆరాధించే లక్ష్మీదేవి లాకెట్ వేసుకుంది.ఫ్యాషన్ షో అంటేనే మితిమీరిన గ్లామర్ షో ఉంటుంది.

అంతేకాకుండా ప్రైవేటు పార్ట్స్ కనబడేలా దుస్తులు ధరిస్తారు.దీని పై హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు దేవతల లాకెట్లు ధరించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.హిందూ దేవతలను అవమానించిందంటూ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీ పై ఫిర్యాదు చేశారు.హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు, లక్ష్మీదేవి లాకెట్ ధరించి అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ తాప్సీ మీద కేసు వేశారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

తాప్సి పన్ను పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా తెలిపారు.హిందువుల ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవి బొమ్మతో కూడిన లాకెట్ ను మెడలో వేసుకుని ఎక్స్ పోజింగ్ చేస్తూ లాక్ మి ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసిందని ఆమెపై ఫిర్యాదు చేశామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

మరి ఈ ఘటన పై తాప్సీ పన్ను ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

తాజా వార్తలు