ఆఫ్రికా దేశాల పర్యటనలో ప్రధాని మోదీ

భారత్‌ పెట్టుబడులకు మొజాంబిక్‌ ముఖద్వారంలాంటిని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.

ఆ్ర‌ఫీకాదేశాల పర్యటన‌లో భాగంగా గురువారం ఆయ‌న మొజాంబిక్ రాజధాని మొపుటో చేరుకున్నారు.

అక్క‌డి విమానాశ్ర‌యంలో మీడియాలో ప్రసంగిస్తూ, .మొజాంబిక్‌ స్వాతంత్య్ర సమయంలో భారత్‌ గట్టిగా మద్దతిచ్చిందని గుర్తు చేసారు.ఇరుదేశాల మధ్య వాణిజ్యం అభివృద్ధికి త‌న ప‌ర్య‌ట‌న దోహదం చేస్తుందని భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.1982 తర్వాత భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కూడా కావ‌టం విశేషం.ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆఫ్రికా ఖండంలో పర్యటిస్తున్నారు.5 రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.తొలిరోజు .సాంస్కృతిక బంధం బలోపేతం, ద్వైపాక్షిక అంశాలపై చ‌ర్చించేందుకు ఆయన మొజాంబిక్ దేశాధ్యక్షుడు న్యూసీతో భేటీ కానున్నారు కాగా మొజాంబిక్‌ జాతీయ చట్టసభ అధ్యక్షురాలు విరోనికా మకామోతోనూ మోదీ భేటీ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఆహార రంగాల్లో అందునా వాణిజ్య పంట‌ల అవ‌స‌రాల‌పై పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు విరోనికాతో ్ర‌ప‌త్యేకంగా చ‌ర్చించే ఆస్కారం ఉంది.

అలాగే .మలౌనాలోని శాస్త్ర, సాంకేతిక పార్క్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడనున్నారు.

తొందరొద్దు ... వైసిపి కార్యాలయంలో కూల్చివేత పై హైకోర్టు 
Advertisement

తాజా వార్తలు