నియోజకవర్గానికో పీకే ! రంగంలోకి ఐ ప్యాక్ ?

ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నాయి.

వారు అందించే వ్యూహాల ప్రకారం ఎప్పటికప్పుడు పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థుల కంటే దీటుగా ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి.

ఇదే విధంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ 2019 ఎన్నికలకు ముందు నుంచి ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం తో ఒప్పందం చేసుకుంది.ఐ ప్యాక్ టీం సత్తా ఏంటో 2019 ఎన్నికల ఫలితాలు తరువాత అందరికీ అర్థం అయ్యింది.2024 ఎన్నికల్లోను ఇదేవిధంగా ఐ ప్యాక్ టీమ్ తో ముందుకు వెళ్లాలనే వ్యూహాన్ని  రచించుకుని మళ్ళీ అఖండ మెజారిటీతో విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు.మొన్నటి వరకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహాలు అందించిన ఐ ప్యాక్ టీమ్ అక్కడ వ్యూహాలను అందించే బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో ఇక పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టబోతున్నారు.

      అలాగే ఈనెల 15 నుంచి ఐ ప్యాక్ టీమ్ ఏపీలో తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నం కాబోతున్నాయి.మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరుపై సర్వే చేయబోతున్నారు.ఈ మేరకు నియోజకవర్గానికో ఐ ప్యాక్ టీం సభ్యుడు పని చేయబోతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో జగన్ కు అందించబోతున్నారు.అలాగే అదే నివేదికను మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అందించబోతున్నారు.

Advertisement

ఇక ప్యాక్ టీమ్ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులతో పాటు,  అసలు పార్టీలకు అతీతంగా ఉండే తతస్తులను కలిసి వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోబోతున్నారట .   

  అలాగే వైసిపి ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు రూపొందించింది.ఈ కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది.అయితే దీనిపై పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ ఏంటి అనేది జగన్ కు  ఐ ప్యాక్ టీం అందించబోతోందట.

ఎన్నికల వరకు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వాస్తవ పరిస్థితులను , ప్రభుత్వంపై ఏ ఏ అంశాల్లో వ్యతిరేకత పెరుగుతోందని విషయం పైన ఈ టీం సభ్యులు పనిచేయబోతున్నరట.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players
Advertisement