పైనాపిల్ తో చ‌ర్మానికి మెరుగులు.. ఇలా వాడితే మొండి మ‌చ్చ‌ల‌ను సైతం త‌రిమికొట్టొచ్చు!

పైనాపిల్( Pineapple ).చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే పండ్లలో ఒకటి.

పులుపు, తీపి రుచులను కలగలిసి ఉండే పైనాపిల్ ను పిల్లల‌ నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు.అలాగే పైనాపిల్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ గా ఉంటాయి.

ఆరోగ్యపరంగా పైనాపిల్ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే చ‌ర్మానికి మెరుగులు దిద్ద‌డానికి కూడా పైనాపిల్ ఉపయోగపడుతుంది.

పైనాపిల్ తో వివిధ రకాల చర్మ సమస్యలను వ‌దిలించుకోవ‌చ్చు.అదెలా తెలుసుకుందాం ప‌దండి.

Advertisement

చాలా మంది మొండి మచ్చలతో బాధపడుతుంటారు.అలాంటివారు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెత్తగా గ్రైండ్ చేసిన పైనాపిల్ ప్యూరీని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జె( Aloe vera )ల్, రెండు చుక్కలు టి ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే చర్మంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

అలాగే డ్రై స్కిన్ తో బాధపడేవారు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు పైనాపిల్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( HONEY ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.పది నిమిషాల పాటు ఆరబెట్టుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా కనుక చేస్తే డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.చర్మం కోమలంగా మృదువుగా మారుతుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

స్కిన్ వైట్నింగ్‌ కోసం ఆరాటపడేవారు రెండు టేబుల్ స్పూన్ల పైనాపిల్ ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Advertisement

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజు కనుక చేస్తే స్క్రీన్ టోన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

మీ చర్మం కొద్ది రోజుల్లోనే తెల్లగా, కాంతివంతంగా మెరుస్తుంది.

తాజా వార్తలు