'పిల్లి ' రాజీనామా వార్నింగ్ ! జగన్ ఏం చేస్తారో ..? 

వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య మొదలైన ముసలం సంచలనంగా మారింది.

కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన టిక్కెట్ విషయంలో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మధ్య రామచంద్రపురం టిక్కెట్ విషయంలో వివాదం  రేగింది.

అంతేకాకుండా గత కొంతకాలంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మంత్రి వేణు వ్యవహరిస్తున్నారని,  పిల్లి వర్గానికి చెందిన వారిపై కేసులు పెట్టడం,  రకరకాలుగా ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి తన కుమారుడుని పోటీకి దింపాలని భావిస్తూ ఉండగా,  మంత్రి వేణు ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండడం సుభాష్ చంద్రబోస్ కు ఆగ్రహం కలిగిస్తుంది.

ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మంత్రి వేణు కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేయడంతో పాటు,  తమ ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు .

ఇక నిన్ననే మంత్రి వేణు కూడా రామచంద్రపురం( Ramachandrapuram ) లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.దీంతో ఈ ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదం మరింతగా పెరిగిందనే విషయం బహిర్గతం అయ్యింది .ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి వేణు పై ఫిర్యాదు చేశారు.

Advertisement

వేణు ని పిలిచి ఇద్దరినీ కూర్చోబెట్టి  మాట్లాడుతానని చెప్పినా,  బోస్ అంగీకరించలేదట .తాను వేణు తో కలిసి కూర్చొనని  బోస్ జగన్ కు చెప్పారట. మా అబ్బాయికి టికెట్ విషయం పక్కన పెడితే రామచంద్రపురంలో పార్టీ క్యాడర్ తీవ్ర మనస్థాపం తో ఉంది.

మంత్రి వేణు వెనక నడిచేందుకు వారంతా సిద్ధంగా లేరు.బోస్ ఇంటికి వెళ్లొచ్చావు కదా.తన ఈ వద్దకు రావద్దంటూ పార్టీ విజయానికి కష్టపడిన వైసిపి కార్యకర్తలను మంత్రి వేణు దరిచేరనివ్వడం లేదు.

వైసీపీ నిర్మాణం నుంచి నా వెన్నంటి ఉన్న వారిపై నాలుగేళ్లు గా కేసులు పెడుతున్నారు అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandra Bose) చెబుతున్నారు.

ఇక జగన్ తనకు ఎటువంటి అన్యాయం చేయలేదని , తాను జీవితంలో ఎప్పుడైనా ఆ మాట అంటే.చాలా పాపం చేసినట్లేనని సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు.కార్యకర్తలు అభీష్టం మేరకు నడుచుకుంటానని జి అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని జగన్ కు తెలిపానని ,  వేణుకు టిక్కెట్ ఇస్తే భరించే శక్తి ఇక్కడ పార్టీ క్యాడర్ కు లేదని చెప్పేసారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

ఈ వ్యవహారం మరింత రచ్చగా మారడంతో,  ఈ విషయంలో ఏం చేయాలని విషయంలో జగన్ సైతం ఆలోచనలో పడ్డారట.ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఎన్నికల సమయంలో ఈ వివాదం ఏర్పడడంతో దీనిపైన ఇప్పుడు జగన్ దృష్టి సారించారట.

Advertisement

ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక పరిష్కార మార్గం చూడాలని భావిస్తున్నారట.

తాజా వార్తలు