Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( Praneeth Rao ) మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు.

అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి న్యాయస్థానాన్ని కోరారు.అలాగే గత ఎన్నికల్లో ఒక పార్టీకి చెందిన డబ్బులు తరలింపులో వీరి పాత్ర ఉందన్నారు.

ఈ నేపథ్యంలో వీరిని విచారించడం చాలా అవసరమని పోలీసులు కోర్టుకు తెలిపారు.అయితే పోలీసుల కస్టడీని( Police Custody ) రిజెక్ట్ చేయాలని అడిషనల్ ఎస్పీ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే మూసీలో దొరికిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎస్ఐబీవే అనడానికి ప్రూఫ్ లేదని తెలిపారు.కాగా ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు( Nampally Court ) కస్టడీ పిటిషన్ పై ఇవాళ తీర్పును వెలువరించనుంది.

Advertisement
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు