Danam Nagender : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేయాలని టీఎస్ హైకోర్టులో పిటిషన్

ఎమ్మెల్యే దానం నాగేందర్( Danam Nagender ) పై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ మేరకు దానంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.అనంతరం బీఆర్ఎస్ ను వీడిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Petition In Ts High Court To Disqualify Mla Dhanam
Petition In Ts High Court To Disqualify Mla Dhanam-Danam Nagender : ఎమ్�

ప్రస్తుతం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Secunderabad Congress MP candidate )గా దానం నాగేందర్ పోటీ చేయనున్నారన్న సంగతి తెలిసిందే.అయితే ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.కాగా ఈ పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు