మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పై రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి రిట్ పిటిషన్ వేశారు.

నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని పిటిషనర్ ఆరోపించారు.శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్, నామినేషన్ లో వాస్తవాలు తొక్కిపెట్టారని రాఘవేంద్ర రాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.కాగా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించాలని ఆర్వోకు ఆదేశాలు జారీ చేసింది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement