కుక్కకు సీమంతం....ఇరుగుపొరుగువారి ఆశీర్వాదాలు!

ఊళ్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్న సామెత గుర్తు ఉండే ఉంటుంది.ఎవరిదో పెళ్లికి వేరే వాళ్లు హడావిడి చేసినప్పుడు ఇలాంటి సామెతను వాడుతూ ఉంటారు.

కానీ ఇప్పుడు కుక్క కు సీమంతం చేసే స్థాయిలో జనాలు ఉన్నారు.చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

Pregnant Function For Pet Dog In Karnataka, Karnataka Man, Pet Dog Pregnant Func

అలా పెంపుడు జంతువులను తమ సొంత బిడ్డలు లాగే భావించి అన్ని వసతులు కల్పిస్తూ ఉంటారు.అయితే కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం మాత్రం ఆ కుక్క కు మరింత ప్రాధాన్యత ఇస్తూ అది గర్భం దాల్చింది అని ఏకంగా సీమంతం కూడా జరిపించారు.

ఈ ఘటన కర్ణాటక లోని విజయపుర లో చోటుచేసుకుంది.విజయపుర సోలాపూర్ రోడ్డులో నివసించే సామాజిక కార్యకర్త ప్రకాశ్ కుంబర్ కుటుంబం పోమరేనియన్ జాతి కుక్కను పెంచుకుంటోంది.

Advertisement

దానికి ముద్దుగా సోనియా అని నామకరణం చేసుకున్న వారు దానిని తమ ఇంట్లో ఓ సభ్యురాలిగానే భావించారు.అయితే ఆ శునకం గర్భం దాల్చడం తో ఆ కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు.

దీనితో ఘనంగా దానికి సీమంతం చేశారు.ఈ కార్యక్రమానికి ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి మరి ఘనంగా సీమంతం నిర్వహించారు.

వచ్చిన పేరంటాళ్లు దానికి బొట్టు పెట్టి, హారతి పట్టి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలంటూ దీవించారు.ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ బహుమతులు కూడా అందించారు.

యజమాని ప్రకాశ్‌ అయితే దానికి ఒక బంగారు గొలుసునే బహుమతిగా అందించారట.మొత్తానికి కుక్కకు కూడా సీమంతాలు చేసే స్థాయికి చేరిపోయారు జనాలు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు