ఈ సమస్యలు ఉన్నవారు ద్రాక్ష పండ్లు అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..?

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినాలన్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే పండ్లలో ముఖ్యంగా ద్రాక్ష పండ్లు ( Grapes )కూడా చాలా ముఖ్యమైనవి.

ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ ఏ, బి6, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే ద్రాక్షలో పొటాషియం, క్యాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల పోషకాలు కూడా ద్రాక్షలో లభిస్తాయి.

అయితే ద్రాక్షలో ఉండే ప్లేవనాయిడ్స్‌ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉండేలా కూడా చేస్తాయి.అంతేnకాకుండా రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును కూడా ద్రాక్ష పెంచుతుంది.

అయితే నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది.అంతేకాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.ఇక అధిక రక్తపోటు( High blood pressure ) ఉన్నవారు ద్రాక్షను తింటే బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement

ఇక చదువుకునే పిల్లలు కూడా తరచుగా ద్రాక్ష పండ్లు తింటే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది.అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.అయితే ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించడంలో కూడా సహాయపడతాయి.

దాంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశలు కూడా తగ్గిపోతాయి.ఇక ద్రాక్షను రెగ్యులర్ గా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపి,కొవ్వు శరీరంలో చేరకుండా చేస్తుంది.ఇక మధుమేహం( Diabetes ) ఉన్న వారు కూడా ద్రాక్ష తినకూడదని చెప్తారు.

కానీ ద్రాక్షలో రక్తంలో చక్కెర నియంత్రించి శక్తి ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు.ద్రాక్ష తింటే మైగ్రేన్, తలనొప్పిని, మతిమరుపును అదుపులో ఉంచుతుంది.ఇక మెదడు పనితీరును చురుగ్గా కూడా మారుస్తుంది.

అయితే జీర్ణ సమస్యలు, ప్రేగు సమస్యలతో బాధపడుతున్న వారు ద్రాక్షకు దూరంగా ఉండాలి.అలాగే డయాబెటిస్, అధిక బరువుతో( Overweight ) బాధపడుతున్న వారు కూడా లిమిట్ గా తీసుకోవాలి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అలాగే ఎలర్జీ సమస్యలు ( Allergy problems )ఉన్నవారు కూడా ద్రాక్షకు దూరంగా ఉంటేనే మంచిది.

Advertisement

తాజా వార్తలు