ఆ వ‌య‌సు వారు ప్ర‌తి రోజు దానిమ్మ తినాల‌ట‌.. ఎందుకంటే?

చూసేందుకు ఎర్ర‌గా నిగ‌నిగ‌లాడుతూ అందంగా క‌నిపించే దానిమ్మ పండు తినేందుకు కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.

అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు.

అలాగే విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిస్ సి, విట‌మిన్ కె, ఐర‌న్‌, కాల్షియం, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబ‌ర్ మ‌రియు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉండ‌టం వ‌ల్ల‌.దానిమ్మ ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.

ముఖ్యంగా న‌ల‌బై ఏళ్లు పైబ‌డిన వారు ఖ‌చ్చితంగా ప్ర‌తి రోజు ఒక దానిమ్మ పండును తినాల‌ని నిపుణులు చెబుతున్నారు.ఎందుకు తినాలో.

అస‌లు తింటే ఏయే ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయో.ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సాధార‌ణంగా న‌ల‌బై ఏళ్లు దాటాయంటే చాలు.కీళ్ల నొప్పులు, కండ‌రాల వాపులు వంటివి తీవ్రంగా మ‌ద‌న పెడుతూ ఉంటాయి.

అయితే దానిమ్మ పండును తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులు, కండ‌రాల వాపుల‌ను అద్భుతంగా నివారిస్తాయి.

అలాగే న‌ల‌బై ఏళ్లు పైబ‌డిన వారు ముడ‌త‌లు, చ‌ర్మం సాగ‌డం, హెయిర్ ఫాల్ వంటి స‌మ‌స్య‌ల‌తో ఎంత‌గానో క‌ల‌వ‌ర ప‌డుతుంటారు.వీటిని దూరం చేయ‌డంలో దానిమ్మ సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.

అవును, ప్ర‌తి రోజు దానిమ్మ పండు తింటే న‌ల‌బై ఏళ్లు దాటినా చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తూ ఉంటుంది.అదే స‌మ‌యంలో హెయిర్ ఫాల్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

అంతే కాదండోయ్‌.న‌ల‌బై ఏళ్లు పైబ‌డిన స్త్రీ, పురుషులు రెగ్యుల‌ర్‌గా దానిమ్మను తింటే క్యాన్స‌ర్‌, గుండె పోటు, అల్జీమ‌ర్స్‌ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధ్యులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

Advertisement

కాలేయం శుభ్ర ప‌డుతుంది.ర‌క్త పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

మ‌రియు మూత్ర సంబంధిత వ్యాధులు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.