పెద్దిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి..: ఎంపీ రామ్మోహన్ నాయుడు

పుంగనూరులో సిక్కోలు వాసులపై దాడి జరగడం దారుణమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలను అవమానిస్తారా అని ప్రశ్నించారు.

సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.పెద్దిరెడ్డి రాయలసీమ పరువు తీస్తున్నారన్న ఆయన పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.జగన్ కానీ, మంత్రులు కానీ ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.

Validation Check 2026
Advertisement