సజ్జ పంట సాగులో మేలురకం విత్తనాలు.. ఎరువుల యాజమాన్యం..!

సజ్జ పంట( Bajra )ను వర్షాధార పంటగా, నీటి వసతులు ఉంటే వేసవిలో ఆరుతడి పంటగా కూడా పండించుకోవచ్చు.

వర్షాధారంగా అయితే జూన్- జూలై నెలలో విత్తు కోవాలి.

నీటి వసతులు ఉంటే ఫిబ్రవరి నెలలో విత్తుకోవాలి.మధ్యరకంగా ఉండే నేలలు, తేలికపాటి నేలలు, మురికి నీరు పారే నేలలు, నీరు ఇంకె నేలలు సజ్జ పంటల సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మేలు రకం విత్తనాలను గమనించినట్లయితే.హెచ్ హెచ్ బి 67 రకం విత్తనాలను ఖరీఫ్ లేదా వేసవి సాగుకు అనుకూలంగా ఉంటాయి.

వెర్రి కంకి తెగులను తట్టుకొని 70 రోజుల పంట కాలంలో ఎకరాకు దాదాపుగా 10 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

Advertisement

ఐ సి ఎమ్ హెచ్ 356( ICMH ) రకం విత్తనాలు ఖరీఫ్ లేదా వేసవి సాగుకు అనుకూలంగా ఉంటాయి.ఇవి కూడా వెర్రి కంకి తెగులను సమర్ధవంతంగా తట్టుకొని 85 రోజులలో కోతకు వస్తాయి.కాకపోతే గింజలు మధ్యస్థంగా ఉండి ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

పీ హెచ్ బి3 రకం విత్తనాలు ఖరీఫ్, వేసవి సాగుకు అనుకూలంగా ఉండి, వెర్రి కంకి తెగులను తట్టుకొని 85 రోజులలో పంట చేతికి వచ్చి దాదాపు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

ఒక ఎకరాకు రెండు కిలోల విత్తనాలు( Seeds ) అవసరం, కిలో విత్తనాలకు ఆరు గ్రాముల మెటలాక్సిన్ 35ఎన్.డి విత్తన శుద్ధి చేసి వరుసల మధ్య 40 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు గొర్రుతో విత్తనాలు వేసుకోవాలి.ఎకరాకు ఐదు టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

పొలానికి నీటి వసతులు ఉంటే ఎకరాకి 18 కిలోల నత్రజని 10 కిలోల భాస్వరం 15 కిలోల పొటాషియం ఎరువులు పంటకు అందించాలి.ఒకవేళ వర్షాధారంగా సాగు చేస్తున్నట్లయితే 13 కిలోల నత్రజని 10 కిలోల భాస్వరం 8 కిలోల పొటాష్ ఎరువులను పంటకు అందించాలి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
సూపర్ ఉమెన్ అంటే ఇలా ఉంటారు కాబోలు.. వీడియో వైరల్

పంట వేసి ఒక నెల తరువాత వర్షాధార భూమిలో పది కిలోల నత్రజని, నీటి వసతి గల భూమిలో 15 కిలోల నత్రజని పంటకు అందించాలి.

Advertisement

తాజా వార్తలు