జగన్‌ను ప్రజలు పీకేసే రోజులు దగ్గర్లో ఉన్నాయి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

శనివారం మీడియాతో మాట్లాడుతూ.క్యాబినెట్‌లో ఎంతమందని జగన్ పీకుతారో రేపు చుద్దామని.

అసలు పీకేను పీకే దమ్ము జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు.రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకగలరో చూద్దామని అన్నారు.

సొంత క్యాబినెట్‌ను మార్చుకోలేనివాడు.ప్రతిపక్షాల పీకుతారా?.రాయలసీమ ప్రాజెక్టులకు తాను ఏమి చేశారో జగన్ చెప్పాలి.

జగన్ ఏమి పీకారో ఒక పుస్తకం రాస్తే.ఏమి పీకలేదో పది పుస్తకాలు రాయొచ్చు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మీడియా, పత్రికలపై ముఖ్యమంత్రి జగన్ దాడి చేస్తే.శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతున్నందునే పీకుడు భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో ఒక రోడైనా వేశామని జగన్ చెప్పుకోగలరా? అని నిలదీశారు.యువత, మహిళలు,రైతుల జీవితాల్లో జగన్ వెలుగులను పీకేశారన్నారు.

అటెన్ష్ కోసమే జగన్ అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు