ఆర్డీఎక్స్ అంటున్న హాట్ పిల్ల! గట్టిగా పేలడానికి రెడీ అయ్యిందే

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

మొదటి సినిమాతో ఓ వైపు అందాలు, మరో వైపు పెర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ భామకి తెలుగులో ఊహించని విధంగా భారీ క్రేజ్ వచ్చేసింది.

దీంతో వరుసగా రవితేజతో డిస్కో రాజా, అలాగే వెంకి మామాలో వెంకటేష్ కి జోడీగా నటించే అవకాశం సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

Payal Rajput New Movie Rdx Launching-ఆర్డీఎక్స్ అంట�

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో కొత్త సినిమాని మొదలెట్టింది.ఆర్డీఎక్స్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంబోత్సవం తాజాగా జరుపుకుంది.

సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాతో శంకర్ భాను దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇక ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లుగానే పాయల్ రాజ్ పుత్ పాత్ర చాలా హాట్ అండ్ బోల్డ్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో రాడాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మరి పాయల్ ఈ సినిమాతో ఆర్డీఎక్స్ బాంబ్ లో మరోసారి గట్టిగా పేలుతుందో లేదో చూడాల్సిందే.

నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?
Advertisement

తాజా వార్తలు