కించపరిచే విధంగా పవన్ సినిమాలు..: మంత్రి అంబటి

బ్రో మూవీ అట్టర్ ఫ్లాప్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.బ్రో మూవీ కలెక్షన్లు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారన్నారు.

సినిమాను సినిమాగా తీయాలన్న మంత్రి అంబటి ఎవరో నిర్మాత డబ్బులు పెడితే సినిమాలో తన శత్రువులను తిట్టాలని పవన్ చూశారని విమర్శించారు.పవన్, డైరెక్టర్ త్రివిక్రమ్ కూర్చొని తనపై స్క్రిప్ట్ రాశారన్నారు.

పవన్ తనను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు.వారాహీ వాహనాన్ని తన కాళ్ల కింద పెట్టుకొని అమ్మవారిని అవమానించారని పేర్కొన్నారు.

అందుకే బ్రో సినిమాకు కలెక్షన్లు రాలేదని వెల్లడించారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు