వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

వైసీపీ నేతలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.వేర్పాటువాద వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

ఇకపై అలాంటి కామెంట్స్ చేస్తే తనలో తీవ్రవాదిని చూస్తారని హెచ్చరించారు.రాష్ట్రంలో విభజన రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.

పబ్లిక్ పాలసీ అంటే కూడా తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొడతారా అంటూ మండిపడ్డారు.ఏపీని విడగొడతామంటూ వ్యాఖ్యలు చేస్తే తోలుతీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు.

రాయలసీమ గురించి మాట్లాడుతున్నారన్న ఆయన మీరు ఏం చేశారని ప్రశ్నించారు.రాయలసీమ వలసలను ఎందుకు ఆపలేకపోయారని, స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయని మీకు ఉత్తరాంధ్ర కావాలా అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

రాష్ట్రాన్ని, ప్రజలను విడగొట్టింది ఇంతటితో చాలని స్పష్టం చేశారు.

Advertisement