టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు ఉన్న రేంజ్, ఫాలోయింగ్ మరే హీరోకు లేదు.
అందుకే ఈయన సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చిన అది నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన లైనప్ ను వరుస క్రేజీ సినిమాలతో ఫిల్ చేసాడు.మరి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh ) ఒకటి.
డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.ఇప్పటికే ఈ కాంబోలో గబ్బర్ సింగ్ ( Gabbar Singh ) వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వీరి కాంబోపై ఇప్పుడు మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.ఇన్నాళ్లకు మళ్ళీ ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో భారీ హైప్ పెరగడమే కాకుండా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేయడంతో మరింత హైప్ పెరిగింది.ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ పై ఒక అప్డేట్ తెలుస్తుంది.
ఉస్తాద్ నుండి గ్లింప్స్ ( Ustaad Bhagat Singh Glimpse ) రాబోతుంది అని తెలుస్తుంది.
మే 11న ఈ సినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మాసివ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.ఆ రోజు విశేషం ఏంటంటే వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ( Gabbar Singh Release Date ) మే 11నే రిలీజ్ అయ్యింది.మరి అదే రోజు గ్లింప్స్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని గట్టి ప్లాన్ లో ఉన్నట్టు టాక్.
చూడాలి ఈసారి పవన్ కళ్యాణ్ కు ఎంత తిక్క ఉందో దానికి ఎంత లెక్క ఉందో.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే శ్రీలీల ( SreeLeela ) హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy