పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది రెమ్యూనరేషన్ ఇంకా రాలేదా..? అన్ని కోట్లు పెండింగ్ లో ఉందా!

రెమ్యూనరేషన్( Remuneration ) విషయం లో ప్రతీ హీరో ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు.

డబ్బింగ్ చెప్పే సమయానికి హీరోలకు పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ చేతుల్లో ఉండాలి.

లేకుంటే డబ్బింగ్ కూడా చెప్పను అంటూ గోల చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు.అలాంటి ఇండస్ట్రీ లో అసలు డబ్బు మీద ఏ మాత్రం వ్యామోహం చూపించని వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే.

సినిమా ఒప్పుకునే ముందు అడ్వాన్స్ తీసుకుంటాడు అంతే.మిగిలిన డబ్బులు నిర్మాతలు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాడు.

గబ్బర్ సింగ్ కి కూడా రెమ్యూనరేషన్ విడుదలైన రెండు నెలల తర్వాత ఇచ్చాడట.అది కూడా పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, బండ్ల గణేష్ కి తోచినంత రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చాడని, అన్ స్టాపబుల్ షో కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తెలిపాడు.

Advertisement

అలా పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాకి రెమ్యూనరేషన్ విషయం లో బాగా నష్టపోయాడట.

ఇక ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన అత్తారింటికి దారేది చిత్రం ( Attarintiki Daredi )కి కూడా నిర్మాత భోగవల్లి ప్రసాద్ ( BVSNPrasad )కూడా పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు.తన తదుపరి సినిమా విడుదల అయ్యేలోపు బ్యాలన్స్ కోటి 80 లక్షల రూపాయిలను ఇచ్చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు.కానీ ఆయన ఆ బ్యాలన్స్ చెల్లించకుండా తన తదుపరి చిత్రమైన నాన్నకు ప్రేమతో సినిమాని విడుదల చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.

అప్పుడు పవన్ లాయర్ నుండి ఆ సినిమా విడుదల ఆపేయాలి అంటూ నోటీసులు వెళ్లాయి.ఆ తర్వాత బోగవల్లి ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి ఈ విషయం చెప్పి, దయచేసి సినిమాని విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా బ్యాలన్స్ డబ్బులు ఇస్తానని చెప్పాడట.

పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకున్నాడు కూడా, కానీ ఇప్పటి వరకు ఆ కోటి 80 లక్షల రూపాయిలు పవన్ కళ్యాణ్ కి ఇవ్వలేదట.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

పవన్ కళ్యాణ్ కూడా ఆ తర్వాత అడగడం మానేసాడు అట, అలా ప్రసాద్ గారు అత్తారింటికి దారేది సినిమా రెమ్యూనరేషన్ విషయం లో పవన్ కళ్యాణ్ కి నష్టం తెచ్చాడు.అయితే ఇప్పుడు ఆయన జనసేన పార్టీ( Janasena party ) లో చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ( Varahi Vijaya Yatra )లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.

Advertisement

ఎన్నికలలో ఈయన కూడా జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తాడో లేదు తెలియదు కానీ పార్టీ నిర్వహించే ప్రతీ కార్యక్రమం లో పాల్గొంటున్నాడు.

తాజా వార్తలు