చంద్రబాబు మద్దతు కోరిన పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ ఉద్యమానికి సిద్దం అయిన విషయం తెల్సిందే.

వైజాగ్‌లో తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనబోతున్నాడు.

ఈ సందర్బంగా జనసేన కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలంటూ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.ఇదే సమయంలో జనసేనాని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌ వైజాగ్‌లో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు.పవన్‌ విజ్ఞప్తికి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో బీజేపీ చీప్‌ కన్నా లక్ష్మినారాయణకు కూడా పవన్‌ ఫోన్‌ చేసి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరాడట.ఇంకా బీజేపీ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

Advertisement

ఇంకా పలు కార్మిక సంఘాలు మరియు ప్రజా సంఘాలను కూడా పవన్‌ కళ్యాణ్‌ మద్దతు కోరినట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు