'ఉస్తాద్ భగత్ సింగ్'గా పవర్ స్టార్.. ఈసారైనా సెట్స్ మీదకు వెళ్లేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈయన మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉండగా సినిమాలను పక్కన పెట్టాడు.

ఇక ఇప్పుడు మళ్ళీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.అయితే ఈయన లైనప్ లో హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా ఉంది.మరి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతున్న దీనిని సెట్స్ మీదకు తీసుకు వెళ్లకుండా వేరే సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని గత రెండు రోజులుగా గట్టి టాక్ వస్తుంది.మరి వీరి కాంబోలో ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా వస్తుందా.

లేదంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వస్తుందా అనేది తెలియడం లేదు.ఈ డైలమా లో ఉండగానే ఈ రోజు భవదీయుడు భగత్ సింగ్ తరహాలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు.

ఈ రోజు ఉదయం పవన్ పోస్టర్ తో కూడిన టైటిల్ ను ప్రకటించారు.ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ కొత్త టైటిల్ ప్రకటించారు.

ఈ పోస్టర్ కూడా గత భవదీయుడు భగత్ సింగ్ పోస్టర్ తరహా లోనే ఉంది.

దీంతో ఈ సినిమా అనౌన్స్ మెంట్ క్రేజీగా మారిపోయింది.పవన్ కళ్యాణ్ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ తో ఆకట్టు కుంటున్నాడు.మరి ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఒకటేనా కాదా అనే కన్ఫ్యూజన్ అయితే ఫ్యాన్స్ లో ఉంది.

ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈసారి కూడా ఎంటెర్టైనమెంట్ మాత్రమే కాదు అంతకు మించి అని పోస్టర్ ద్వారా చెప్పేసారు.

దీంతో ఈ సినిమా విషయంలో అందరు ఆతృతగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్నాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడో లేదా ముందుగానే స్టార్ట్ చేస్తాడో చూడాలి.

తాజా వార్తలు